Wednesday, November 19, 2014

యత్ర నార్యంతు పూజ్యంతే


అమ్మాయి అంటే అంత చులకనా?
ఏం చేసిన భరిస్తుంది గనకనా?
హింసించినా...దూషించినా..
తన మనసుని ...గాయపర్చినా...

అణువణువున నీకై ఆరాటం
తన బ్రతుకే నిత్య పోరాటం
యత్ర నార్యంతు పూజ్యంతే..రమంతే తత్ర దేవతా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

అడుగడుగునా అవమానించినా
తన గౌరవాన్ని నువ్వ్ మంటగల్పినా
వేదించినా.....విసిగంచినా..
నయవంచన...దగా జేసినా...

పడి లేచే కెరటం తన నైజం
దైన్యం కాదది సడలని ధైర్యం...
యా దేవి సర్వ భుతేషు: శక్తి రూపేణ సంస్థితా...

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
తన బాల్యాన్ని చిదిమేసినా...
తన యౌవ్వన్నాన్ని కాలా రాసినా...
తన ప్రాణం కన్నా మిన్నగా
ప్రేమించే నిన్ను నిన్నుగా
జీవం పొసే ఓ తల్లిగా
లోకంలో కల్పవల్లిగా

వెలిగే జగతికి జనని నారీమణి
అర్ధిస్తోంది......బ్రతకనివ్వమని....
యా దేవి సర్వ భుతేషు: మాతృ రూపేణ సంస్థితా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

Sunday, June 1, 2014

నీ రూపం కాంచన శిల్పం


నీ రూపం కాంచన శిల్పం
నీవే నా ప్రపంచం
నీ స్నేహం వేకువ స్వప్నం
నీవే నా సమస్తం
విరబూసిన నీ దరహాసం
విరి తేనియల నీ మౌనం
గుచ్చుకుంది నా గుండెల్లో నీ చూపుల మన్మధ బాణం
విలవిల్లాడే నా ప్రాణం
నిలవనివ్వని ఆరాటం
కోరుతోంది కోవెల గంటై నా అణువణువు నీ అభిమానం
నీ అందం శీతల గంధం
నీవే నా ఆనందం
నీ వర్ణం వెన్నెల హారం
నీవే నా ఆధారం
మరువలేని నీ అనురాగం
మధురమైన ప్రణయ సరాగం
మ్రోగుతోంది నా మది వీణై నీకొసం సుస్వర సంగీతం
మొరవింటాడని నా దైవం
మొదలైంది నాలో ధైర్యం
చేరమంది నను నీ ఒడిని గుసగుసలాడే ఉదయసమీరం
నీ తేజం శిఖరం నైజం
నీవే నా వసంతం
నీ చిత్రం కెరటపు ముత్యం
నీవే నా అదృష్టం
నచ్చిందని నీ వ్యక్తిత్వం
నడిచా నీ దారిలొ నేస్తం
పరవశాన పరిచా నీకై స్నిగ్ద మనొహర హృదయ పుస్తకం
అంతం కాదిది ఆరంభం
జీవిత గమనం ప్రారంభం
నిలవాలని ఆకాంక్షిస్తా మన అనుబంధం సుస్తిర కాలం
Yours Lovingly : Srikanth Chintakindi alias "Sinivaali"

Thursday, May 23, 2013

Tuesday, January 27, 2009

యువతరం

"మేల్కొల్పి జగాన్ని నిద్రించే యువతరాన్ని వదిలేసి సుఖాన్ని నడిపించగ నవతరాన్ని ఉద్యమించు సోదరా దెశ ప్రగతికి కదలిరా సోదరి నిర్మిద్దాం నవ భారతవని! కదలిరా సహొదరి నిర్మిద్దాం నవ భారతవని!!"

Sunday, July 27, 2008

కోరిక

"చిటపటమని చిటపటమని కురిసే చినుకు
సన్నగా మొదలైంది నా పెదవుల వణుకు
నీ నగుమోము దొచింది కన్నుల కునుకు
అరవిందాలకె కలుగదా నీవంటే కినుకు
చేయాలని ఉంది యెదైన నీ కొరకు
నడవాలని ఉంది నీతొనే కడవరకు"